YS Jagan - Vizag Steelమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విశాఖలో పర్యటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు పర్యటనకు స్థానికుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆ స్పందనకు అధికార పార్టీ ఉలిక్కిపడింది.

దీనితో చంద్రబాబు కి విశాఖ అంటే ప్రేమలేదు. అసలు ఉంటే స్టీల్ ప్లాంట్ కంటే ముందుగా విశాఖ రాజధానిగా అయ్యేలా చెయ్యాలి. అమరావతి రైతులతో కేసుల విరమింప చెయ్యాలి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వాదన తెరమీదకు తెస్తున్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటిస్తే అంతకు మించి ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు.

అమరావతి రైతులు వారి పొలాలు ప్రభుత్వానికి ఇచ్చి నష్టపోయారు. అమరావతి రాజధాని గా ఉండటమే ఏపీకు మంచిదని నమ్మి దానిని రాజధానిగా చేశారు చంద్రబాబు. తన సొంత నిర్ణయం ప్రకారం అమరావతి ఉద్యమానికి మద్దతు అయితే ఇచ్చారు. కానీ ఆ రైతులు తమ సొంత ప్రయోజనాలు వదిలేసుకుని చంద్రబాబు చెప్పారని కేసులు వెనక్కు తీసుకోరు కదా?

విశాఖ వాసుల మీద ప్రేమ ఉంటే అమరావతి రైతులకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి రాజధానిని విశాఖకు తరలించవచ్చు కదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపలేక రాజధాని వస్తే స్టీల్ ప్లాంట్ కంటే విశాఖకు ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?