YSRCP Leaders speaking against ys jagan governmentభారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ లో ఏడాది కూడా కాకముందే తిరుగుబాటు మొదలు కావడం ఆ పార్టీ వారికి మింగుడుపడటం లేదు. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ నుండి దూరంగా జరిగి కొరకరాని కొయ్యిగా మారారు. మరోవైపు… అదే బాటలో ఇంకొంతమంది వెళ్లనున్నారని కొన్ని మీడియాలలో వస్తుంది.

ఒక మీడియాలో పార్టీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కూడా బీజేపీతో మంతనాలు జరుపుతూ ఇటీవలే కాలంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వార్తనిచ్చింది. మరో మీడియాలో ఇటీవలే మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ మీద నిఘా పెడితే… ఆ సీసీటీవీ ఫ్యూటేజ్ లో షాకింగ్ విషయాలు తెలిశాయని ఒక సంచలన విషయం చెప్పింది.

ఆ సీసీటీవీ ఫ్యూటేజ్ లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కలవడం కూడా కనిపించిందని ఆ ఛానల్ తెలిపింది. ఈ వార్త అధికార పార్టీని కుదిపేస్తుంది. అధికార పార్టీలో చీలిక తెచ్చి బీజేపీ బలపడే ప్రయత్నాలు చేస్తుందా? అదే జరిగితే జగన్ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందా? వంటి ప్రశ్నలు వారి మదిలో మెదులుతున్నాయి.

అయితే ఇటువంటి వాటి ప్రభావం మా మీద ఉండదని… భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను కాపాడతాయని మరికొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అనుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయాకా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుగా రంజుగానే సాగుతున్నాయి.