BJP Targeting YS Jaganవైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మొన్న ఆ మధ్య పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది.

జగన్ మోహన్ రెడ్డి కు చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… వైఎస్సార్ కాంగ్రెస్ అనే పేరు వాడుకోకూడదని గతంలోనే ఎన్నికల సంఘం నిర్దిష్టమైన నిబంధనలను ఆ పార్టీ దృష్టికి తెచ్చినా పట్టించుకోవట్లేదని అన్నా వైఎస్ఆర్ పార్టీ పిటిషన్ లో ఆరోపించింది. దీనిపై ప్రాధమిక వాదనలు విన్న హై కోర్టు జగన్ పార్టీకి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు జరీ చేసింది.

తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుంది అని వైకాపా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంగా ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎన్నికల సంఘం ఈ విషయంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

రఘు రామ కృష్ణం రాజుకు ఇచ్చిన షో కాజ్ నోటీసు మీద వైఎస్సార్ కాంగ్రెస్ అని రాయకూడదని ఆయన ఈ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. ఇది ఇలా ఉండగా…. అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా వెనుక రఘురామ కృష్ణం రాజే ఉండి ఇవ్వన్నీ చేయిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించడానికి ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.