raghu rama raju and vijay sai reddyసాయి… నువ్వు నా మీద వేసిన ట్వీట్ కు కామెంట్లు చూసా… అమ్మ బాబోయ్… ఓ 15 నుండి 20 చదివాను… నీ పరిస్థితిలో నేనుంటే… అసలు నువ్వు డబ్బులిచ్చి నా మీద రాయించినోళ్లు కూడా అంత దరిద్రంగా రాయలేకపోతున్నారు బాబు. అమ్మ నాయనోయ్… ఎవడైనా గుండె ఆగి చావాల్సిందే. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తే నిన్ను అసలు కొంపలోకి రానివ్వరు. అంత దరిద్రంగా నిన్ను తిడుతున్నారు.

ట్వీట్లు పెట్టనేలా… అమ్మ నా బూతులు తిననేలా సాయి..! నువ్వు పెడితే నాకు రెడీగా ఉన్నాయి, ఓ అయిదారు ట్వీట్లు రెడీ చేసి ఉంచా. నువ్వు ఆపు అంటే నేను ఆపుతా, నువ్వు వేస్తే నేను వేస్తా. కానీ నువ్వు పెట్టే ట్వీట్ల మీద కామెంట్లు చూస్తే మటుకు చాలా అసహ్యంగా ఉంటుంది. మరీ 151 స్థానాలు గెలుచుకున్న ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్న నిన్ను అంత దారుణంగా తిడితే చూడలేకపోతున్నాను.

నా మీద పోటీ చేయడానికి సాయిరెడ్డిని ఆహ్వానిస్తున్నానని, వాళ్ళకు పెద్దగా ఎవరూ దొరకట్లేదు, ఈయన పదవి లేకుండా ఖాళీగా ఉన్నాడు కాబట్టి, సాయిరెడ్డి తనకు తాను ఎక్కువగా ఊహించుకునే వ్యక్తి కాబట్టి తనపై పోటీ చేస్తే బాగుంటుందని, ముఖ్యమంత్రిగా ఉన్న ఏ1 పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది – ఇది ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది అన్న తర్వాత సాయిరెడ్డి ఓ ట్వీట్ చేయడం దానికి ఆర్ఆర్ఆర్ రిప్లై ఇవ్వడం జరిగింది.

సాయిరెడ్డి : జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు…నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!

రఘురామకృష్ణంరాజు : అవునా? నా జీవితం నీకు ఏ1 కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు, పాపం వివేకానంద రెడ్డిలా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు చేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది Mr. ఏ2!

సాయిరెడ్డి : ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ళకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్ళే రాళ్లతో కొడతారు.

రఘురామకృష్ణంరాజు : నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో.