YS Jagan Mohan Reddy and Raghu Rama Krishnam Rajuమా ముఖ్యమంత్రి స్పష్టమైన తెలుగులో ‘అనర్హత’ అని ఓ 10 సార్లు పలికితే చాలు, అదే శిరోధార్యంగా భావించి తాను వైసీపీకి రాజీనామా చేసేస్తానని రఘురామకృష్ణంరాజు చేసిన వ్యంగ్యాస్త్రాలు తెలిసినవే. ‘రాజు గారి ర్యాగింగ్’ పేరుతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు ఎంతో వైరల్ కాగా, తాజాగా జగన్ చదివిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ వెబ్ సైట్ అడ్రస్ చెప్పేందుకు గానూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పడుతోన్న ఇబ్బంది ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. వెబ్ యుఆర్ఎల్ కు సంబంధించిన అంశాలను తెలియజేయడానికి, పేపర్ ను చూస్తూ చదువుతోన్న జగన్, వాటిని స్పష్టంగా పలకడంలో తడబాటుకు గురికావడంతో, సదరు వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది.

నిజానికి అధికారం చేపట్టిన నాటి నుండి జగన్ కు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట హంగామాను సృష్టించాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ విమర్శలకు బదులిచ్చేలా ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంటుందని భావిస్తుండగా, మాట్లాడిన ప్రతిసారి ఏదొక విషయంలో సీఎం గారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. బహుశా అప్పట్లో నారా లోకేష్ వీడియోలు కూడా ఈ స్థాయిలో సందడి చేయలేదేమో!?

ఇంతకీ ఏం తెలియజేయాలని జగన్ తాపత్రయపడ్డారు అంటే, ‘జగనన్న స్మార్ట్ సిటీస్’ పేరుతో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వెంచర్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చదరపు గజం “కేవలం” 17500/- రూపాయలకే విక్రయిస్తోంది. ఆ ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే ముందుగా జగన్ చెప్పిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ క్రమంలోనే సదరు వెబ్ సైట్ పేరు చెప్పడానికి ప్రయత్నించారు.