Raghurama-Krishna-Rajuవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నం… ఎక్కడ జరిగింది..? ఎవరు చేయించారు..? ఇలాంటి ప్రశ్నలకు తావిస్తూ ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో పార్ట్ 1ను ఆదివారం ముగించడంతో, తదుపరి వారంలో ప్రసారం కాబోయే పార్ట్ 2లో ఆర్ఆర్ఆర్ ఏం చెప్పబోతున్నారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

2019లో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే బేధాభిప్రాయాలు వచ్చాయని చెప్పిన ఆర్ఆర్ఆర్, వైఎస్సార్ తో తనకు చాలా సన్నిహత సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించబడిన ఎంపీని బహుశా తాను ఒక్కడినేమోనని అభిప్రాయపడిన ఆర్ఆర్ఆర్, తనను కొట్టిన అధికారి పేరు ఎంక్వయిరీలో చెప్తానని అన్నారు.

తాను రోజు రచ్చబండ నిర్వహించడానికి కారణం… రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయని, సహజంగా ఒక రోజు మాట్లాడిన అంశం పైన మళ్ళీ మాట్లాడబోనని, కానీ ప్రతి రోజు తనకు కొత్త సమస్యలను ప్రజలే తెలియజేస్తున్నారని, వారు నేరుగా చెప్పలేకపోతున్నారు గనుక, ప్రజల వాయిస్ ను తన స్వరం ద్వారా వినిపిస్తున్నానని తెలిపారు.

అటు శ్రీకాకుళం పక్కన ఉన్న సోంపేట నుండి అటు అనంతపురం, చిత్తూరు జిల్లా బోర్డర్ల నుండి తనకు రోజూ కాల్స్ వస్తున్నాయని, దాదాపుగా ప్రతి రోజు ఓ అయిదారు గంటలు ఇలా ప్రజల కోసం కేటాయిస్తున్నానని, తనకు తెలుగు భాష రాని పీఏ మాత్రమే ఉన్నారని, దీనికి ఎవరి నుండి సహకారం లేదని, ప్రజలే స్వయంగా తనకు ఫోన్ చేసి తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలకు మా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారిపై తాను ఎలాంటి విమర్శలు చేయబోనని, కానీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ప్రజలకు మంచి జరిగే వరకు తాను ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటానని స్పష్టం చేసారు.