YSR Congress Party MPs Resignations స్పీకర్ సుమిత్రా మహాజన్ తో భేటీ తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల వ్యవహారం తేలలేదు. రాజీనామాలు భావోద్వేగంతో చేసినట్లున్నారు… మరోసారి పునరాలోచించుకోవాలని వైకాపా ఎంపీలకు లోక్‌సభ సభాపతి సుమిత్రా మహాజన్‌ సూచించారు. జూన్ 5న తమ అభిప్రాయం కలిసి తెలపాలని స్పీకర్ వారికి చెప్పారు.

అందుతున్న సమాచారం ప్రకారం తాము భేషరతుగా రాజీనామా చేస్తున్నాం అని చెప్పకుండా వైకాపా ఎంపీలు ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని అందుకే రాజీనామాలు చేస్తున్నామని స్పీకర్‌కు చెబుతున్నారు. ఒత్తిళ్ల వల్ల రాజీనామాలు చేస్తున్నామంటే..స్పీకర్ అంగీకరించరు. మరోసారి ఆలోచించుకోవాలని చెబుతారు.

వీలైనంత వరకు ఈ విషయాన్ని సాగదీసి రాజీనామాలను పెండింగ్‌లో ఉంచుకోవాలన్నది వైసీపీ వ్యూహం. దీనితో ఉపఎన్నికలు రాకుండా నిరోధించవచ్చు. అదే సమయంలో ఎంపీలుగా రాజీనామా చేశామని చెప్పుకోవచ్చు. .ఎంపీల పదవీ కాలం ఏడాదిలోపు ఉంటే.. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించదు. 2014 జూన్‌ 4వ తేదీన లోక్‌సభ మొట్టమొదటిసారిగా సమావేశమైంది. అంటే 2019 జూన్‌ 4తో ఈ పార్లమెంట్ కు ఐదేళ్లు నిండుతాయి. జూన్ 5 తరువాత స్పీకర్ ను కలవడం అంటే పదవీ కాలం ఏడాదిలోపే ఉంటుంది కాబట్టి ఉపఎన్నికలన్న ప్రశ్నే రాదు