ఎన్టీఆర్ వర్ధంతి రోజున లక్ష్మీ పార్వతి చేసిన ‘ఆత్మ’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు దాచి ఉంచిన రహస్యాన్ని తాను నేడు చెప్పబోతున్నానని అన్న లక్ష్మీ పార్వతి, గతంలో తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానని తెలిపింది.
జీవితా రాజశేఖర్ లు మద్రాస్ కు తీసుకెళ్లిన సమయంలో ఓ 16 ఏళ్ళ అమ్మాయిలో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించిందని, తనతో అనేక విషయాలు పంచుకుందని ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా జనులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తాము విన్నది, చదివింది నిజమేనా…. అన్న రీతిలో ఒకటికి రెండు సార్లు నెటిజన్లు చెక్ చేసుకున్న తర్వాత తేలిన విషయం ఏమిటంటే… ఎన్టీఆర్ ఆత్మతో లక్ష్మీ పార్వతి మాట్లాడారట. సరే ఇక్కడివరకు స్టోరీ బాగానే ఉంది గానీ, ఇంతకీ ఏం విషయాలను ఎన్టీఆర్ ఆత్మ లక్ష్మీ పార్వతికి చెప్పింది? అన్నది మాత్రం గుట్టువిప్పలేదు.
అయితే లక్ష్మి పార్వతి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరో వీడియో తెరపైకి వచ్చింది. గతంలో ‘వీకెండ్ ఆర్కే’ కార్యక్రమంలో… ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ప్రతి రోజు అర్ధరాతి 12 గంటలకు తాను వైఎస్సార్ ఆత్మతో చర్చలు జరుపుతానని జగన్ అన్న కధనం ప్రస్తుతం మళ్ళీ వెలుగుచూసింది.
వైసీపీ వర్గాలు ఈ ఆత్మలతో మాట్లాడడం ఏమిటో సామాన్య ప్రజలకు అయితే అర్ధం కావడం లేదు. ఈ బంపర్ ఆఫర్ కేవలం వైసీపీ పార్టీకి చెందిన వారికేనా? ఇతరులకు లేవా? అయితే జాబితా ఇక్కడితో ఆగితే పర్లేదు, భవిష్యత్తులో ఇంకెంతమంది వైసీపీ నేతలు ఇలా ‘ఆత్మల’ వ్యాఖ్యలు చేస్తారోనని గుసగుసలాడుకోవడం ప్రజల వంతవుతోంది.
Undavalli’s Estimation About Alliances In AP
Tollywood Stars: Who Has The Better Lineup?