ysr-congress-partyఆంధ్రప్రదేశ్ లో ఘోరమైన కుల రాజకీయాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ స్వయంగా దానిని పెంచిపోషించడం గమనార్హం. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో జీవీఎంసి ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. అందులో భాగంగా ఒక రెడ్డి కుల సమ్మెళనానికి హాజరు అయ్యారు.

“మీ అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మీ సొంత పార్టీ అనుకుంటున్నారు. మీ అందరికీ నేను ఒక్కటే మనవి చేసుకుంటున్నా… మీరందరు ప్రతి ఒక్కరు టీడీపీ నుండి రెడ్డిక సామాజిక వర్గం నుండి పోటీ చేస్తుండవచ్చు కానీ మీ అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ కే ఓటు వెయ్యాలి. వైఎస్సార్ కాంగ్రెస్ రెడ్డిక అభ్యర్ధికి టికెట్ ఇవ్వకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ నే గెలిపించాలి,” అని ఆయన కోరారు.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… రెడ్డిక అనే సామాజిక వర్గం వేరు. అయితే విశాఖలో రెడ్డి సామాజికవర్గం తక్కువే. అయితే రెడ్డిక అనే సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో… రెడ్డిలను ఉత్తరాంధ్రలో రెడ్డిక అంటరాని కొత్త భాష్యం చెప్పి రెడ్డి సోదరుల ఆత్మీయ సమ్మేళనం అంటూ మీటింగులు పెట్టడం గమనార్హం.

అయితే రెడ్డి సామాజిక వర్గం… రెడ్డిక సామాజిక వర్గం వేరని సామాజిక వేత్తలు అంటున్నారు. అది కూడా పక్కన పెడితే కుల ప్రాతిపదికన మీటింగ్ పెట్టి ఆ సామాజిక వర్గం వ్యక్తి పోటీ చేసినా ఓడించాలని చెప్పడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీలో కులాల కంపు ఎప్పటికి పోతుందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.