YSR Congress Party candidates list - (3)శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైకాపా విడుదల చేసింది. మొత్తం శాసనసభకు 175 అభ్యర్థులను, పార్లమెంట్ కు 25 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు. అయితే పార్లమెంట్ అభ్యర్థుల లిస్టును చూసి జగన్ అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. రెండు చోట్ల తప్ప 2014 లోని ఎంపీ అభ్యర్థులను అందరినీ జగన్ ఈసారి మార్చడం విశేషం.

నెల్లూరు, ఒంగోలు – ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు బలమైన అభ్యర్థులు దొరికారు. గుంటూరు, విజయవాడలలో – లావు కృష్ణదేవరాయలు, పొట్లూరి వర ప్రసాద్ టీడీపీ అభ్యర్థులకు పోటీ ఇవ్వగలరని అనుకుంటున్నారు. శ్రీకాకుళం నుండి బాపట్ల వరకు ఉన్న 12 ఎంపీ సీట్లలో కొంత మేర నరసాపురం రఘు రామ కృష్ణం రాజు, విజయవాడ పొట్లూరి వరప్రసాద్ తప్ప అందరూ వీక్ అభ్యర్థులే కావడం గమనార్హం. వీరు పార్టీకి విపరీతమైన గాలి ఉంటే తప్ప గెలిచే అవకాశం లేదు.

నెల్లూరు, ఒంగోలులో మేకపాటి వర్గం, వైవీ సుబ్బారెడ్డి వర్గం ఏమేరకు కొత్త అభ్యర్థులతో కలిసి పని చేస్తారో చూడాలి. మొత్తంగా వైకాపా ఎంపీ అభ్యర్థుల జాబితా ఒకింత నిరాశపరిచిందనే చెప్పాలి. మరోవైపు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో జగన్, పార్టీ నాయకులు, అభ్యర్థులను ఇప్పటి నుండి పూర్తిగా ప్రచారంలో నిమగ్నం అవ్వబోతున్నారు. రేపు ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. మర్చి 25 నామినేషన్లకు తుది గడువు. ఏప్రిల్ 11న పోలింగ్. మే 23న ఫలితాలు రాబోతున్నాయి.