YSR Congress Leaders disappoint with YS jaganవిపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి ఇంకా తత్వం బోధపడినట్టు లేదు. కేవలం ఆయన, ఆయన పార్టీ నాయకుల నోటి దురుసు వల్ల ఆ పార్టీ నంధ్యాల ఉపఎన్నికలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుని నడి రోడ్డులో ఉరితీయాలని, రాళ్ళతో కొట్టి చంపాలని జగన్ చెప్పడంతో ఓటర్లు విస్తుపోయారు.

దీనితో టీడీపీకి భారీ విజయం కట్టబెట్టారు. అయినా జగన్ లో మార్పు రాలేదు. పెద్దంతరం, చిన్నంతరం లేకుండా సాగే ఆయన విమర్శలు కొనసాగుతున్నాయి. నిన్న అనంతపురంలో సాగిన ఆయన పాదయాత్రలో చంద్రబాబు అబద్దాల పుట్టని, దగాకోరని, పిట్టలదొరని జగన్ మోహన్ రెడ్డి పరుషపదజాలంతో దూషించారు.

దీనితో తలలు పట్టుకోవడం ఆ పార్టీ నాయకుల వంతు అయ్యింది. అధికారమే పరమావధిగా ముందుకు సాగుతున్న జగన్ కేవలం తనను ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేసినందుకుగాని చంద్రబాబుపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నట్టు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక భూవివాదంలో ఒక మహిళపై కొందరు దాడి చేస్తే, దళిత మహిళ చీర, జాకెట్టు చించేలా టీడీపీ నేతలను ఉసిగొలిపే హీనస్థితికి చంద్రబాబు దిగజారారని జగన్ ఆరోపించారు.

ఎక్కడో విశాఖలో జెర్రిపోతులపాలెంలో జరిగిన ఒక వివాదానికి ముఖ్యమంత్రే ప్రేరేపించారని ఆరోపించడం వల్ల అసలు విషయం పలుచబడి జగన్ ఉన్మాదిగా కనపడుతుంది. ఇలాంటి చవుకబారు విమర్శల వల్ల గవర్నమెంట్ ను ఇరుకునపెట్టకపోగా ప్రజలలో తానే పల్చన అవ్వడం ఒక్క జగన్ కె చెల్లిందని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఆయనకు తెలీదు, చెప్తే వినడు అని వాళ్ళు అనుకుంటున్నారట