Panchumarthi Anuradhaపంచుమర్తి అనురాధ… తెలుగుదేశం పార్టీ మహిళానేత, ఎమ్మెల్సీ. చంద్రబాబుకు వీరవిధేయ నేతగా ప్రాచుర్యం పొందిన ఈమె తెలుగుదేశం ప్రతిపక్షంలోకి వచ్చిన నాటి నుండి బాగా యాక్టీవ్ అయ్యారు. ప్రతిపక్షంలో కూడా టీడీపీ వాణిని బలంగా చెబుతూ ప్రజలలోకి దూసుకుపోతున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు ఇది బొత్తిగా పొసగడం లేదు.

దీనితో ఆమెపై తరచు విమర్శలు చేస్తున్నారు. సహజంగా రాజకీయాలలో విమర్శలు.. ప్రతివిమర్శలు సహజమే. అయితే దానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి, డీసెన్సీ ఉండాలి. ఇప్పుడు అనురాధ మీద విమర్శలలో అదే లోపిస్తుంది. గతంలో ఆమెకు క్యాన్సర్ సోకింది. అందులో భాగంగా కీమోథెరపీ చేయించుకుని క్యాన్సర్ మహమ్మారిపై గెలిచారు.

కీమోథెరపీలో భాగంగా జుట్టు కోల్పోవడం మాములే. దానితో అనురాధ విగ్గు పెట్టుకుంటారు. ఇప్పుడు దాని మీద విమర్శలు చెయ్యడం శోచనీయం. నీకు జుట్టే లేదనుకున్నాం… మెదడు కూడా లేదని, కొందరైతే ఏకంగా విగ్గు వనిత అని పదే పదే దానినే ప్రస్తావించడం దారుణం. క్యాన్సర్ ని జయించడం అనేది మాములు విషయం కాదు.

ఎంతో దృఢసంకల్పం ఉంటే గానీ అది సాధ్యపడదు. అటువంటి వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి వారికి సపోర్టుగా నిలవాల్సింది పోయి అటువంటి చీప్ విమర్శలు చెయ్యడం దారుణం. ఇటువంటి విమర్శలు చెయ్యకుండా ముఖ్యమంత్రి జగన్ తమ నేతలను నిలువరిస్తే మంచిది.