Jayasudha's First After Husband Deathవైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా చేసిన జయసుధ ఆ తరువాతి కాలంలో రాజకీయాలలో అంత యాక్టివ్ గా లేరు. 2014 లో ఆమె ఓడిపోయారు. ఆ ఎన్నికల తరువాత ఆమె తెలంగాణ రాజకీయాలలో కాకుండా ఏపీ వైపు వచ్చి టీడీపీలో చేరారు తాజాగా ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె సాయంత్రం వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారని కధనం. పార్టీ అదినేత జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరబోతున్నారు.

టీడీపీలో చేరాక కూడా ఆమె ఎప్పుడు రాజకీయాలలో కనిపించలేదు. క్రిస్టియన్ మత సభలకు తరచూ వెళ్ళే జయసుధ ఆ వర్గం ఓటర్లను ఆకర్షించ గలరని వైఎస్సాఆర్ కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే ఆ వర్గం పార్టీ తోనే ఉంది. జగన్ కుటుంబం కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ కుటుంబమని మన అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ ఎవరో ఒక స్థాయి నాయకులను పార్టీలోకి తీసుకుని రావాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. వారు పార్టీకి ఉపయోగపడినా పడకపోయినా కేవలం టీడీపీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయడమే వ్యూహంగా కనిపిస్తుంది.

ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలను వైఎస్సాఆర్ కాంగ్రెస్ చేర్చుకుంది. వీరందరూ టీడీపీ లో అసంతృప్త నేతలే కావడంతో ఆ పార్టీ కూడా పెద్దగా ఆపే ప్రయత్నం చెయ్యలేదు. ఈ ఎన్నికలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్టు పరిణమించాయి. ఒకవేళ ఈ సారి కూడా ఓడిపోతే కొత్తగా ఏర్పాటైన ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రాకుండా వరుసగా రెండు టర్మ్ల పాటు ప్రతిపక్షంలో మనగలగడం అసాధ్యం. దీనితో జగన్ తన సర్వ శక్తులు ఈ ఎన్నికలలో ఒడ్డుతున్నారు. దీనికి తెరాస కూడా సాయపడుతుంది.