YS-Jagan-and-Pawan-Kalyan-Commit-Blunders-At-The-Same-Timeరాబోయే ఎన్నికలలో తన మద్దతు జగన్ మోహన్ రెడ్డికే ఉంటుందని పవన్ కళ్యాణ్ తనతో చెప్పినట్లుగా వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి అభిప్రాయాలనే వెలిబుచ్చారు సదరు నేత. వచ్చే ఎన్నికలలో వైసీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని, త్వరలో రెండు పార్టీలు కలుస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు ఈ మాజీ ఎంపీ. గతంలో ప్రజారాజ్యం తరపున బరిలోకి దిగినపుడు పవన్ ను చాలా దగ్గర నుండి చూశానని, సమాజానికి ఏదో చేయాలన్న తపన, బాధ్యత కనిపిస్తాయని, ఒక విజన్ ఉన్న నాయకుడని పవన్ ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇప్పటికే అనధికారికంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, త్వరలో అధికారికమవుతుంది అంటున్నారు ఈ వైసీపీ నేత.

రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగోచ్చు గానీ, తాము సింగిల్ గానే (వామపక్షాలతో కలిపి) బరిలోకి దిగుతామని వివిధ సందర్భాలలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేసారు. మరి వైసీపీ నేత చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఈ పార్టీలన్నీ ఓ మహాకూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న ఈ పార్టీలన్నింటిని ఏకం చేసే ఆ “సూత్రధారి” ఎవరో? ఏ ఢిల్లీలో ఉన్నారో?!