YSR Congress allegations on chandrababu naidu casteఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కులం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఒక సామాజిక వర్గం కోసం అమరావతి అంటూ ప్రచారం చేసి రాజధాని మార్చే ప్రయత్నాలు జరుగుతుండగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ అధికార పక్షం దాడికి దిగింది.

బీసిజీ రిపోర్టుని మీడియా కు వివరించిన ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయకుమార్‌ ని చంద్రబాబు తన ప్రసంగంలో గాడు అని సంబోధించారు. సహజంగా హుందాగా మాట్లాడే చంద్రబాబు అనుకోకుండా మాట్లాడిన మాటకు కులం రంగు పులుముతున్నారు. దళిత ఐఏఎస్‌ అధికారిని దూషించారు అంటూ అనుకూల ఉద్యోగ సంఘాలతో దాడి చేయిస్తున్నారు.

చంద్రబాబు తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని, గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా, అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, శాంతి భద్రతలను గౌరవించే ప్రతిఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టాలని పిలుపు నివ్వడం గమనార్హం. చంద్రబాబు అంబేద్కర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఏపీలో అన్ని సమస్యలకు కులమే పరిష్కారంలా ఉంది. ప్రతి సమస్యను పక్క ద్రోవ పట్టించడానికి కులం కార్డు ఉపయోగిస్తే సరి. ఒక వ్యక్తిని తిడితే అది కులం కారణంగానే ఎందుకు అనుకోవాలి? ఒక ఓసీని తిడితే ఎందుకు కులం వల్ల కాదు? అంబేద్కర్ విగ్రహాన్ని కూడా గుర్తు పట్టాలని పార్టీ అంబేద్కర్ విగ్రహానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెయ్యడం విశేషం,” అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.