YSR Congress Aided Ravi kiran arrestedవైసీపీ అధినేత జగన్ ను సమర్ధిస్తూ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టిడిపి నేతలను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఫేస్ బుక్ లో ‘పొలిటికల్ పంచ్’ అనే పేజ్ ఉన్న విషయం రాజకీయ విజ్ఞులకు సుపరిచితమే. దీనిపై ఒకానొక సమయంలో హీరో శివాజీ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతూ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇదేదో జగన్ పై అభిమానంతో వీరు చేస్తున్నది కాదని, స్వయంగా సాక్షి మీడియా నుండే వీరికి జీతభత్యాలు వెళ్తున్నాయన్న వాస్తవం వెలుగు చూసింది.

రాజకీయ విమర్శలు చేస్తే సహిస్తాం గానీ, వ్యక్తిగత దూషణలకు దిగితే ఉపేక్షించేది లేదని ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన ఏపీ సర్కార్, ఈ ‘పొలిటికల్ పంచ్’ పేజ్ నిర్వహిస్తున్న ఇంటూరి కిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఊహించని వాస్తవాలు బయట ప్రపంచానికి తెలిసాయి. సాక్షి మీడియాకు అనుబంధంగా సోషల్ మీడియాలో వైసీపీ ఓ టీం ఉందని, చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగత విమర్శలు చేయడమే లక్ష్యంగా ఈ టీం పని చేస్తోందని, అలాగే ఈ టీం మొత్తానికి జీతాలు కూడా సాక్షి మీడియా హౌస్ నుండే అందుతున్నాయని తేలింది.

దీంతో ఈ విషయంపై పోలీసులు ఈడీకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. నిజానికి ఇందులో పోస్ట్ లు చూసిన వారు… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా తిట్టినా కూడా ఎవరూ ఏమీ పట్టించుకోరా? అనే రేంజ్ లో వ్యక్తిగత దూషణలు చేస్తుంటారు. అలాగే నందమూరి బాలకృష్ణ, లోకేష్ లను కూడా ఒక రేంజ్ లో ఆడుకుంటుంటారు. మొత్తానికి ఇలా విమర్శలు చేస్తున్న వారికి సమాధానంగా చేసిన ఈ అరెస్ట్ లో ‘ట్విస్ట్’ ఇచ్చిన వాస్తవాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి. తన డైరెక్ట్ మీడియాలో జగన్ చేయలేని విమర్శలన్నీ ఈ ఫేస్ బుక్ పేజ్ ద్వారా చేస్తున్నారనేది ఈ అరెస్ట్ తో తేలిన ప్రధాన అంశం.