ys-jagan-yatra-ysr-biopicయాత్ర సినిమాని ప్రఖ్యాత కాంగ్రెస్ నాయకుడు వైఎస్సాఆర్ కధగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ విడిపోయాడు..ఇక వైఎస్సాఆర్ యాత్ర చేసిందే కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకు రావాలి అని, అయితే ఈ బయోపిక్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా మైలేజ్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ ను వైఎస్ జగన్ కి చూపించి వారికి నచ్చినట్లుగానే ట్రైలర్ ని కట్ చేసి లాంచ్ చేసినట్లుగా తెలుస్తుంది. ట్రైలర్ కూడా అదే మూడ్ ని ప్రతిబింబిస్తుంది అనుకోండి. అయితే ఎవరు ఎంత కాదన్నా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు..కానీ ఈ సినిమా మూడ్ చూస్తుంటే వైఎస్ ను కాంగ్రెస్ ను విడదీసి చూపించే ప్రయత్నమే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.

దానికి గల కారణం ఏంటి అంటే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోవడమే. అయితే…ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎసార్సీపీకి అనుకూలంగా యాత్ర తెరకెక్కితే మాత్రం..అది ఖచ్చితంగా వైఎస్సాఆర్ బయోపిక్ అవ్వదు. చూద్దాం మరి ఈ సినిమాలో వైఎస్సార్ ని ఎలా చూపించారో..ఏ రకమైన కోణాన్ని ఆవిష్కరించారో.