వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తో “యాత్ర” సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వైఎస్సార్ గా మలయాళ సూపర్ మమ్ముట్టి నటిస్తుండగా, ఈ రోజు ప్రారంభమైన షూటింగ్ లో మమ్ముట్టి పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో వైఎస్ బయోపిక్ ను ఉపయోగించుకుని లబ్ది పొందాలని వైసీపీ ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేం మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. వైఎస్సార్ జీవించి లేకపోయినా, మమ్ముట్టి రూపంలో వైఎస్ ను చూసుకునే అవకాశం అభిమానులకు కలగనుంది.
#YATRA #YatraTheMovie started here is the glimpse of MEGA welcome to @mammukka sir on to the SETS of YATRA – JUST BEFORE THE FIRST SHOT of YATRA @devireddyshashi @MahiVraghav @ysjagan @ManviDad @SakshiHDTV @varun2c @weforjagan @Sagardovari @NaniChinnuu pic.twitter.com/UzC1otyKX4
— Sunil Manduti (@sunilmanduti) June 23, 2018