YS-Vivekananda-Reddy-suspicious-deathమాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యగా ప్రాథమికంగా నిర్థారించినట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపారు. వివేకానంద రెడ్డి తలపైన, ఛాతిపైనా గాయాలు ఉన్నాయని, ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలు సేకరించినట్టు ఆయన మీడియా చెప్పారు. కొందరు నిందితుల వేలిముద్రలు గుర్తించామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఈ హత్యకేసును ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు.

కాగా ఇంత స్పష్టంగా హత్య అని తెలుస్తుండగా, వివేకా గుండెపోటుతో మరణించారు అని మొదలు వార్తలు వ్యాపించిన వారి మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కేసును తప్పు దారి పట్టించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కుటుంబసభ్యులు కాకుండా వివేకా పీఏ ఎందుకు మొదట పోలీసు కంప్లయింట్ ఇచ్చారు అనేదాని మీద కూడా విచారణ చేస్తున్నారు. ఆయన హత్య దగ్గర వారి పనేనా అనే అనుమానాలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు సానుభూతి వచ్చేలా అధికార పక్షం ఇటువంటి చర్యలకు ఉపక్రమించదు అని స్థానిక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. . గత కొంత కాలంగా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇది కుటుంబంలోని వారి పనే అని పులివెందులలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. అటువంటి పాత్ర ఏదైనా తేలితే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. మరోవైపు తమకు రాష్ట్రపోలీసుల మీద నమ్మకం లేదని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వైకాపా డిమాండ్ చేస్తుంది.