ys-vivekananda-reddy murder case to cbiమాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించింది. సిట్‌ నివేదికను 2 సీల్డ్‌ కవర్లలో న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను కోర్టు కొట్టి వేసింది. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుని టీడీపీ రాజకీయలబ్ది కోసం వాడుకోకూడదని కోర్టు నుండి ఆర్డర్ తెప్పించుకున్నారు.

అయితే ఏమైందో ఏమో గానీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత సిబిఐ విచారణ అవసరం లేదని కోర్టులో వాదించారు. ఈ కేసులో 14 అనుమానితులతో వైఎస్ వివేకా కుమార్తె కోర్టుకి ఇచ్చిన ఒక లిస్టులో ఇద్దరు తప్ప మిగతా వారందరూ వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన వారు లేక వైఎస్ కుటుంబానికి సంబందించిన వారు కావడం విశేషం.

దీనితో ఎవరినో కాపాడాలనే ముఖ్యమంత్రి ఈ కేసుని సిబిఐకి అప్పగించడానికి ఇష్టపడలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు సిబిఐ విచారణ అంటే కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా ఇది మరింత ఇబ్బంది అనడంలో ఎటువంటి అనుమానాలు లేవు.