ys vivekananda reddy  Birth Anniversary- no clue on murder caseఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య సంచలనం రేకెత్తించింది. ఘోరమైన హత్య అని కళ్లకు కడుతున్నా తొలుత బాత్ రూమ్ లో కాలుజారి పడిపోయారు అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పడంతో అప్పటి అధికార పార్టీ ఈ హత్యలో ఆ పార్టీ వారి ప్రమేయం ఉందని ఆరోపించారు. జగన్ ఏకంగా చంద్రబాబే చేయించారని అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు.

అయితే టీడీపీ వెర్షన్ ప్రజలలోకి ఎక్కువ వెళ్తుంది అని గ్రహించి ఈ కేసును ప్రచారంలో వాడుకోకుండా జగన్ కోర్టుకి వెళ్లి అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నారు. వివేక కూతురు సునీతను మీడియా ముందుకు తెచ్చి తమకు క్లీన్ చిట్ ఇప్పించుకుని, టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయించారు. పదే పదే మీ ప్రమేయం లేకపోతే సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించారు అని జగన్ ప్రశ్నించే వారు. సునీత కూడా ప్రెస్ మీట్లు పెట్టి అదే డిమాండ్ చేసే వారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.

రెండు నెలలైన ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. కేసులో అరెస్టయిన నిందితులు బెయిలు పై విడుదల అయ్యారు. అప్పట్లో జగన్ అడిగిన సిబిఐ విచారణ ఇప్పటికీ జరగలేదని, ఎన్నికల ముందు పది ప్రెస్ మీట్లు పెట్టిన వివేకా కుమార్తె ఆ తరువాత కనిపించలేదని టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు. దీనితో వివేకా కు న్యాయం జరుగుతుందా లేదా అని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇది ఇలా ఉండగా నేడు వైఎస్‌ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. పులివెందులలోని ఘాట్‌ వద్దకు చేరుకున్న వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వివేకా కుమార్తె సునీతమ్మ, ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు.