YS Vijayamma - YS Sharmila -తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు షర్మిల దీక్ష ఒక్క రోజు పాటు చేసుకోవడానికే పర్మిషన్ ఇచ్చారు. దీనితో ఆమె తలపెట్టిన మూడు రోజుల దీక్షను మిగతా రెండు రోజు లోటస్ పాండ్ లోనే చెయ్యబోతున్నారు.

దీక్షలో షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మ కూడా కూర్చుని సంఘీభావం వ్యక్తం చేశారు. అయితే దీక్ష సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన బయటపడింది. దీక్ష సందర్భంగా వచ్చిన ప్రజలకు తాను కనపడకుండా ఉన్న కెమెరా వాళ్ళను ఆమె పక్కకు తప్పుకోమని అడుగుతున్నారు. ఈలోగా సాక్షికి చెందిన వారు ఏదో చెప్పినట్టు ఉన్నారు.

“ఇక మీ కవరేజ్ చాలు లేమ్మా… ఎలాగూ సాక్షి మాకు కవేరేజ్ ఇవ్వదుగా,” అని అన్నారు షర్మిల. వెంటనే విజయమ్మ ఆమెను వారించడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు బయటపడ్డాయి అని అంతా మాట్లాడుకుంటున్నారు.

“చూడబోతే కూతురికి అండగా… కొడుకుపై మమకారం చంపుకోలేక… విజయమ్మ సతమతం అవుతున్నట్టు ఉన్నారు,” అని పలువురు అనుకుంటున్నారు. ఈ విషయంగా అన్న తో ఉన్న విబేధాల పై షర్మిల బయటపడటం ఇదే మొదటి సారి. అయితే ఇప్పటివరకు జగన్ మాత్రం ఎప్పుడు షర్మిల పార్టీ గురించి పబ్లిక్ గా మాట్లాడలేదు.