YS-Vijayammaదివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్ధం అయ్యారు. గత మూడు నెలలుగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని.. పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని అయితే ఆమె వినలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.

2 రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే.. వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని.. అయితే షర్మిల పెట్టబోయే పార్టీకి మాకు ఎటువంటి సంబంధం ఉండదని… తమ నుండి ఎటువంటి సహకారం ఆ పార్టీకి ఉండబోదని చెప్పారు ఆయన. జగన్, షర్మిల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి గానీ విబేధాలు లేవని చెప్పుకొచ్చారు.

విబేధాలు లేవని పైకి చెప్పినా… విబేధాలు నిజంగా ఉండటమో లేక నిజంగా పార్టీ జగనే పెట్టేస్తే విబేధాలు ఉన్నట్టు చూపించడమో చెయ్యాలి… అటువంటి పరిస్థితిలో తల్లి విజయమ్మ ఏ వైపు ఉండబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈరోజు జరిగిన పార్టీ మొదటి సన్నాహక సమావేశానికి కూడా విజయమ్మ రాలేదు.

షర్మిల ఇంటి వద్ద పెట్టిన బ్యానర్ల మీద కూడా విజయమ్మ ఫోటో లేదు. దీనితో ఆమె జగన్ వైపే ఉండబోతున్నారా అనే అనుమానం కలగక మానదు. ఈ ప్రశ్నలన్నింటీ సమాధానం షర్మిల పార్టీ ప్రకటించి కార్యక్షేత్రంలోకి దిగాకా గానీ దొరకదు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల రాజకీయం మరోసారి రసకందాయంగా మారాయి.