YS Sunitha Reddy has filed a petition in the Supreme Courtవైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, సిఎం జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ వైఎస్ వివేకానందా రెడ్డి హత్య జరిగి సుమారు మూడున్నరేళ్ళయింది. మొదట ఏపీ సీఐడీ తర్వాత సీబీఐ దర్యాప్తు జరిపాయి. అనేక మందిని విచారించి కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ ఇంతవరకు వివేకానుఎవరు హత్య చేశారో కనిపెట్టలేకపోయారు. దర్యాప్తు, విచారణ సాగుతుండగానే కీలక సాక్షులు ఒకరొకరుగా అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతున్నారు.

సీబీఐ దర్యాప్తు ముందుకు సాగనీయకుండా నిందితులే సీబీఐ అధికారుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టు లో ఓ పిటిషన్‌ వేశారు. కనుక ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపి తన తండ్రిని హత్య చేసినవారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని ఆమె పిటిషన్‌లో కోరారు. ఆమె తన పిటిషన్‌లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.

ఒక ఎమ్మెల్యే పెంపుడు కుక్క తప్పిపోతే, మంత్రిగారి ఇంట్లో దొంగతనం జరిగితే యావత్ పోలీస్ శాఖ ఉరుకులు పరుగుల మీద వెతికి పట్టుకొంటుంది. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ హత్యకు గురైతే మూడున్నరేళ్ళు గడిచినా ఇంతవరకు హంతకులు ఎవరో నిర్ధారించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ #హూ కిల్డ్ బాబాయ్?అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తూనే ఉంటుంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుసకు చెల్లెలు అయిన సునీతా రెడ్డికి తన అన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకపోవడం వలననే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిపై ఆయన సోదరి సునీతా రెడ్డికే నమ్మకం లేనప్పుడు రాష్ట్ర ప్రజలు ఏవిదంగా నమ్ముతారు? జగనన్న రాజ్యంలో చెల్లెలికే న్యాయం జరుగకపోతే ఇక రాష్ట్రంలో ఆడపిల్లలకు ఏవిదంగా న్యాయం లభిస్తుంది?అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.