YS_Sharmilaతాను జగనన్న సందించిన బాణ్ణానని గతంలో వైఎస్ షర్మిల పదేపదే గర్వంగా చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు అదే బాణం బూమ్‌రాంగ్‌లాగ అంతే వేగంతో వెనక్కి దూసుకువచ్చి దానిని సందించిన జగనన్నకే గుచ్చుకొంటోంది.

Also Read – చంద్రబాబు నాయుడు… రేవంత్‌ రెడ్డి… ఎవరు బెటర్?

మంగళవారం ఆమె హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విలేఖరులు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీస్ ఇవ్వడంపై స్పందించమని కోరారు.

ఆమె ముందుగా కేసీఆర్‌ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించిన తర్వాత, “వైఎస్ వివేకానంద రెడ్డి ఎంత గొప్ప నాయకుడంటే ఎవరైనా ఆయన వద్దకి వచ్చి తమ సమస్యని చెప్పుకొంటే వెంటనే ఆ వ్యక్తిని వెంటపెట్టుకొని సంబందిత ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అక్కడి అధికారులతో మాట్లాడి అక్కడికక్కడ సమస్యని పరిష్కరించేవారు. అంతా గొప్ప వ్యక్తిని గొడ్డళ్ళతో అతి దారుణంగా హత్య చేసి సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు ఆయనని హత్య చేసినవారెవరో చెప్పలేకపోతున్నారు.

Also Read – జోగి అండ్ సన్స్: ఒకరు సుప్రీంకోర్టులో మరొకరు హైకోర్టులో!

ఆ కేసులో నేరస్తులకి శిక్ష పడలేదు. ఓ రాజకీయ ప్రముఖుడు దారుణ హత్యకి గురైతే నేరస్తులని పట్టుకొని శిక్షించలేకపోతే ప్రజలకు ఈ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆ కేసు సీబీఐ పరిధిలో ఉంది కనుక నేను వారిని కోరేది ఒక్కటే. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి దోషులకి శిక్ష పడేలాచేయండి,” అని వైఎస్ షర్మిల అన్నారు.




Also Read – సీతారాం ఏచూరి ఇక లేరు!