YS Vijayamma - YS Sharmilaవైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుండీ జగన్ కుటుంబం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. దానిపై అనేక ఊహాగానాలు సాగుతానే ఉన్నాయి. ఈ మధ్య షర్మిల పార్టీకి సాక్షి కవరేజ్ ఇవ్వడంతో అన్నా చెల్లలు తమ మధ్య ఉన్న విబేధాలు పరిష్కారించుకున్నారు అనుకున్నారు అంతా.

తాజాగా షర్మిల హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆమెతోపాటు విజయమ్మ కూడా ఈ పెళ్లి వేడుకకు వెళ్లారు. వీరిద్దరే కాకుండా పులివెందులలో హత్యకు గురైన వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత కూడా ఈ వేడుకలో కనిపించారు. షర్మిల పార్టీ పెట్టాకా విజయమ్మ కుమార్తె తో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి.

అలాగే సునీత తన అన్న ప్రభుత్వం పై నమ్మకం లేదని హై కోర్టుకు వెళ్లి తండ్రి హత్యమీద సిబిఐ ఎంక్వయిరీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరంతా కలిసి వెళ్లడం జగన్ రాకపోవడం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్ కు వ్యతిరేకంగా కుటుంబమంతా ఏకం అవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

జగన్ ముఖ్యమంత్రి కాబట్టి తన బిజీషెడ్యూల్ లో రాలేకపోయినా భార్యనైనా పంపాలి కదా రాలేదు అంటే ఏదో ఉంది అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు షర్మిల పార్టీ గురించి జగన్ బహిరంగంగా మాట్లాడలేదు. పైగా ఆ పార్టీకి తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన ఇప్పించారు.