YS Sharmila - YS Jagan

అన్నతో విబేధించి తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. షర్మిలకు జగన్ కు బేధాభిప్రాయాలు ఉన్నాయి గానీ విబేధాలు లేవని చెప్పుకొచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. అలాగే ఆమె పార్టీకు తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. షర్మిల మొదటి మీటింగ్ పెట్టిన రోజులలో సాక్షిలో దాని గురించి పూర్తిగా బ్లాక్ అవుట్ కూడా చేశారు.

తాజాగా షర్మిల ఈరోజు హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలోని వైఎస్ అభిమానులతో సమావేశం అయ్యారు. ఆంధ్ర నేతలు వచ్చి తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అని విమర్శలు వస్తుండడంతో తన స్పీచ్ ను జై తెలంగాణ అంటూ మొదలుపెట్టారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే నా ఆక్షాంక్ష అంటూ చెప్పుకొచ్చారు.

అయితే షర్మిల మీటింగ్ గురించి సాక్షి కవర్ చెయ్యడం విశేషం. సాక్షికి సంబంధించిన వెబ్ సైట్, ట్విట్టర్ హ్యాండిల్స్ లో షర్మిల వ్యాఖ్యలను కవర్ చేశారు. రేపు న్యూస్ పేపర్ లో కూడా కవరేజ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి జగన్ కు షర్మిలకు రాజీ కుదిరిందా? అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇక నుండి సాక్షి తెలంగాణ ఎడిషన్ లో షర్మిల పార్టీగా విస్తారంగా కావేరేజ్ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. మరో వైపు ఇప్పటివరకు సీఎం జగన్ షర్మిల వ్యవహారం మీద బహిరంగంగా మాట్లాడలేదు.