YS-Sharmila-Vivekanda_reddy_Caseప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన చిన్నాన్న హత్య కేసుపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ సోదరుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు కనుక వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై మీ స్పందన ఏమిటి?” అని ప్రశ్నించారు.

వైఎస్ షర్మిల స్పందిస్తూ, “సుప్రీంకోర్టు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడమే మంచిది. మా కుటుంబంలో జరిగిన అత్యంత దారుణమైన హత్య ఇది. మా చిన్నాన్నను ఇంత దారుణంగా ఎవరు హత్య చేశారో బయటకి రావాలి. దోషులందరికీ శిక్షలు పడాలి. ఆయన కుమార్తె సునీతా రెడ్డికి న్యాయం జరగాలి. ఈ హత్య కేసు విచారణను ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదు. నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరిగితే ఈ హత్యకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది కూడా తేలిపోతుంది,” అని సమాధానం చెప్పారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ బహిరంగసభలో రాష్ట్రంలో నా అక్క చెల్లెమ్మలందరినీ బాగా చూసుకొంటున్నానని చెపుతుంటారు. కానీ వరుసకి సోదరి అయిన సునీతారెడ్డి మాత్రం తన జగనన్న రాజ్యంలో తండ్రి హత్య కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి ఆ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకొంటున్నారు.

ఇక సిఎం జగన్మోహన్ రెడ్డితో విబేధించి తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టుకొన్న సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా సునీతా రెడ్డి నిర్ణయాన్ని సమర్ధించడం విశేషం.

పవన్‌ కళ్యాణ్‌ చెప్పు తీసి చూపించినా వెంటనే స్పందించే మంత్రులు తమ అధినేత కుటుంబంలో జరిగిన ఈ హత్య గురించి, వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయించుకోవడంపై ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేకపోతున్నారు. తమ మగతనం చూడమంటూ విర్రవీగే వైసీపీ నేతలు స్పందించలేకపోయారు కానీ ఇద్దరు మహిళలు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి ధైర్యంగా స్పందిస్తున్నారు.