YS Sharmila tour in 33 districts of Telangana33 జిల్లాల ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. వచ్చే నెల 9న తలపెట్టిన భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణలో రాజన్న రాజ్యం కోరుకుంటున్నారన్నారు. పాదయాత్ర మొదలు పెట్టిన రోజు ఏప్రిల్ 9 అని.. ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ఆరోజే మొట్ట మొదట అడుగు వేద్దామన్నారు.

ఎవరు భయపడొద్దని.. రాబోయే ఎన్నికల్లో మన వైఎస్సార్ పార్టీ అధికారంలో వస్తుందని షర్మిల స్పష్టం చేశారు. నిన్న 2023 ఎన్నికల లో తాను ఎక్కడ నుండి పోటీ చేసేదీ ప్రకటించిన ఆమె తాజాగా పొత్తుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. మనకు ఎవరితో పొత్తులు అవసరం లేదన్నారు. మనం టీఆర్ఎస్ చెప్తే వచ్చిన వాళ్ళం కాదని… బీజేపీ అడిగితే వచ్చిన వాళ్లం కాదన్నారు. మనకు ఎవరూ అవసరం లేదన్నారు. దేవుడున్నాడని.. ఆపై ప్రజలు ఆశీర్వాదం అవసరమని షర్మిల పేర్కొన్నారు.

పొత్తుల విషయంలో జగన్ బాట లోనే షర్మిల నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు రెండు ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ను లీడ్ చేసిన జగన్ రెండు సార్లు ఒంటరిగానే పోటీ చేశారు. రెండు సార్లూ ఆయన బీజేపీతో కలిసి పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆయన మాత్రం ఒంటరిగానే పోరాటం చేశారు. అయితే 2014లో ఒంటరిగా వెళ్లడం వల్లే ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది అని చాలా మంది వైఎస్సార్సీపీ నాయకులు అభిప్రాయపడేవారు.

అయితే 2019లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎవరి అవసరం లేకుండానే అధికారంలోకి వచ్చింది. అయితే ఈ నిర్ణయం షర్మిలకు ఎంత వరకు కరెక్ట్ అనేది కాలమే సమాధానం చెబుతుంది. ఇది ఇలా ఉండగా… వచ్చే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గానీ, ఖమ్మం వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో షర్మిల పార్టీ పోటీ చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు. దానిబట్టి ఆమె 2023లొనే డైరెక్ట్ గా ప్రజల ముందుకు వెళ్లి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.