YS-Sharmila-Sakshiఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా తెలంగాణ రాజకీయాలలోకి ఎంటరైన షర్మిల సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారు. అయితే ఆమె కదలికలను గమనిస్తున్న వారు ఆమె గట్టి హోమ్ వర్క్ చేసుకునే వచ్చినట్టు అనుకుంటున్నారు. నిన్న వ్యూహాత్మకంగా అన్న మీద చేసిన కామెంట్లు కూడా తనపై ఉన్న ఆంధ్ర ముద్రను చెరిపివేయ్యడానికే అన్నట్టు ఉన్నాయి.

మరోవైపు… షర్మిల పార్టీలో నేతలను పెంచుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పని చేసిన అధికారులను తన సలహామండలిలో చేర్చుకున్న షర్మిల.. నాన్నతో కలిసి పని చేసిన నాయకుల మీద దృష్టిపెట్టారు. అప్పట్లో ఒక వెలుగు వెలిగి ఈ మధ్య కాలంలో సైలెంట్ అయినవారు తన మొదటి టార్గెట్ గా ఉన్నారట.

పార్టీలోకి ఎక్కువగా యువతనే ఆహ్వానిస్తున్నా వ్యూహ రచనకు, సలహాలకు మాత్రం పెద్దలు ఉండాలని ఆమె అనుకుంటున్నారట. అందులో భాగంగానే ఇద్దరు మాజీ మంత్రులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పార్టీకి అంటూ ఒక బేస్ ఏర్పడ్డాకా ప్రజలలో అనుకున్నాకా వర్తమాన నేతలను టార్గెట్ చెయ్యాలని ఆమె భావిస్తున్నారని సమాచారం.

మరోవైపు… షర్మిల పార్టీ నామకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని సమాచారం. ఎన్నికల సంఘం నుండి అనుమతులు రాగానే ఒక భారీ బహిరంగసభ పెట్టి పార్టీని ప్రకటించాలని ఆమె అనుకుంటున్నారట. తెలంగాణలో ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు ఒక పాదయాత్ర చెయ్యాలని ఆమె ఆలోచన. ఎన్నికల ముందు కాకుండా ముందే చెయ్యాలని అనుకుంటున్నారట.