ys-sharmila-new-sloganఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ డైరెక్షన్ లో ప్రకటించి పార్టీ ప్రకటన కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోటస్ పాండ్ వేదికగా వైఎస్ అభిమానులతో చర్చలు జరుగుతున్నాయి. కీలక నేతలతో ఆమె చర్చిస్తున్నారు. అయితే ఏపీకి చెందిన షర్మిల తెలంగాణలో రాజకీయం చెయ్యడం ఏంటి అని మిగతా పార్టీలు విమర్శిస్తున్నాయి.

దానిని తిప్పికొట్టి… అదే పార్టీ నినాదంగా చేసుకోవాలని షర్మిల ఆలోచన చేస్తున్నారంట. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే ఇక్కడి వాళ్లకే హక్కు ఉందంటూ అధికార పార్టీ నేతలు చేసిన కామెంట్లను ఆమె గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారట. తాను తెలంగాణ కోడలినని.. తనకు హక్కు ఉందని అనుచరుల దగ్గర షర్మిల వ్యాఖ్యానించారని సమాచారం.

పుట్టినిల్లు ఆంధ్ర.. మెట్టినిల్లు తెలంగాణ అని షర్మిల తన పార్టీ నినాదంగా మార్చుకోనున్నారని అంటున్నారు. అయితే గతంలో 2009 తెలంగాణ ఎన్నికలు పూర్తి కాగానే వైఎస్ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చెయ్యడం… 2014కు ముందు తెలంగాణను జగన్ వ్యతిరేకించడం షర్మిలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు… పార్టీ పేరు నమోదు జరుగుతుందని సమాచారం. ఏప్రిల్ 10న పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2003లో అదే రోజున చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించి 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి బాటలు వేశారు. ఒక భారీ బహిరంగసభ పెట్టి ఆరోజు పార్టీని ప్రకటించనున్నారట.