YS Sharmila - meeting with khamam leadersతెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం స్థాపిస్తా అని ప్రకటించారు వైఎస్ షర్మిల. పార్టీ ప్రకటన చేసిన నాడు నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో సమావేశమయ్యారు షర్మిల. తాజాగా ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.

హైదరాబాద్ లో ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం నేడు ముగిసింది. పోడు భూముల అజెండాగా ఖమ్మంలో సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు. 21 న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు.

ఈ ర్యాలీని తెలంగాణ లో షర్మిల బలప్రదర్శన గా చెయ్యనున్నారు. మరోవైపు… పార్టీ పేరు నమోదు జరుగుతుందని సమాచారం. ఏప్రిల్ 10న పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2003లో అదే రోజున చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించి 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి బాటలు వేశారు.

ఒక భారీ బహిరంగసభ పెట్టి ఆరోజు పార్టీని ప్రకటించనున్నారు. అప్పటికి ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమ్మేళనాలను ఏప్రిల్‌ మొదటివారం కల్లా పూర్తి చేయాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం. మరోవైపు పార్టీ కేంద్ర కార్యాలయం కోసం హైదరాబాద్ లో ఒక విశాలమైన బిల్డింగ్ కోసం వెతుకుంటున్నారని సమాచారం.