YS -Sharmila first target nara lokeshవైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలను ఆ పార్టీ ప్రచారానికి బరిలో నిలపబోతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆమె ప్రచారం మొదలు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ద్వారా మంత్రైన లోకేష్ జీవితంలో తన మొట్టమొదటి ఎన్నికలను ఎదురుకుంటున్నారు.

ఓడిపోతే అది లోకేష్ రాజకీయ ప్రస్థానంలో మచ్చగా మిగిలిపోతుంది. దీనితో ఎలాగైనా లోకేష్ ను ఓడించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. గత ఎన్నికలలో మంగళగిరిలో వైకాపా తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఓటమి తరువాత వైఎస్ షర్మిళ తెరవెనుకకు వెళ్లిపోయారు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఆమె మీడియాలో కనిపించింది లేదు.

చివరి సారిగా ఆమె రాజకీయాల గురించి మాట్లాడింది హీరో ప్రభాస్ కు తనకూ సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం చేస్తుందని కంప్లయింట్ చేసినప్పుడే. అప్పుడు తన మీద జరిగిన దుష్ప్రచారం వెనుక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఆమె ఎన్నికల ముందు వైకాపా కోసం సుడిగాలి పర్యటన చెయ్యబోతున్నారు. మరోవైపు వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా ఈ నెల 27 లేదా 28వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.