YS Sharmila Telanganaరాజకీయాలలో భజన అనేది అంతర్భాగం. రాజకీయ నాయకుల కార్యకర్తలు, అభిమానులు ఇటువంటి భజన చెయ్యడం మనం తరచు చూస్తూనే ఉంటాం. తాజాగా తెలంగాణలో షర్మిలకు ఇదే మోతాదులో భజన జరుగుతుంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష చేస్తున్నారు.

దీనికి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచే ప్రముఖ రచయిత కంచె ఐలయ్య షర్మిల దీక్షకు మద్దతు పలికారు. కాకతీయ గడ్డ మీద రుద్రమ దేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు షర్మిలకు ఉందన్నారు.

సమ్మక్క – సారక్క వారసురాలు షర్మిల అని, తెలంగాణ మహిళలు షర్మిలను ముఖ్యమంత్రి చేస్తారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ పాలన పై ప్రశంసలు గుర్తు చేశారు. ఆయన హయాంలో ఆరు వేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రారంభించారని, పేదల చదువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

ఇది ఇలా ఉండగా…. తెలంగాణ పోలీసులు షర్మిల దీక్ష ఒక్క రోజు పాటు చేసుకోవడానికే పర్మిషన్ ఇచ్చారు. దీనితో ఆమె తలపెట్టిన మూడు రోజుల దీక్షను మిగతా రెండు రోజు లోటస్ పాండ్ లోనే చెయ్యబోతున్నారు. జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు.