YS-Jagan-Shuns-Away-from-Pawan-Kalyan-Challenge!ఇద్దరి టార్గెట్ చంద్రబాబు నాయుడు అన్న కోణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఇటీవల కధనాలు ప్రసారం చేసిన జగన్ మీడియా వర్గాలకు ఓ పెద్ద జలక్కే ఇచ్చాడు పవర్ స్టార్. ఇప్పటివరకు అధికారం వద్దన్నారు, చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు కనుక, ఇది తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు గావించింది. అందులో భాగంగానే పవన్ ప్రెస్ మీట్లకు, ట్విట్టర్ ట్వీట్లకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ కధనాలు ప్రసారం చేసింది.

కానీ ప్రస్తుతం జనసేన టార్గెట్ కూడా అధికారమే కావడంతో, జగన్ కు అడ్డుగా పవన్ తగలవచ్చు. ఎప్పుడైతే అధికారమే లక్ష్యమని పవన్ స్పష్టం చేసారో, ఆ సమయం నుండి సోషల్ మీడియాలో జగన్ వర్గీయులు పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా ఆదివారం నాడు జరిపిన బహిరంగ సభకు హాజరయ్యే ముందు నడుచుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వారికి జరగాల్సిందిగా తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మీడియాలో కూడా ఇది స్పష్టంగా రికార్డైంది.

దీంతో పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో మాత్రమేనని, అసలైన రియల్ హీరో జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని, మరో పక్కన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్ మోహన్ రెడ్డి వీడియోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో మొన్నటివరకు తమకే అనుకూలం అనుకున్న జనసేన, తమ రూట్ లోకే కావడం జగన్ కు జలక్ ఇచ్చినట్లయ్యింది. రాజకీయాలు ఎప్పుడు ఏ రూపు సంతరించుకుంటాయో చెప్పలేని పరిస్థితులలో పొలిటిక్స్ జరుగుతున్నాయి.