YS- Jagan - YSRCPతెలంగాణ ఎన్నికలలో మహాకూటమి వర్గాల సీట్ల పంపకం ఆలస్యం చెయ్యడం గురించి సాక్షి వెబ్ సైట్ లో ఒక ఐటెం వేసింది. నోటిఫికేషన్ వచ్చేసి నామినేషన్లు కూడా మొదలు అవుతున్న సీట్ల పంపకం అభ్యర్థుల ప్రకటన చేయకపోవడంతో నెటిజన్లు మహాకూటమి మీద కుళ్ళు జోకులు వేస్తున్నారని సాక్షి ఒక ఐటెం రాసేసింది.

ఇంతకు ఎన్నికలు 2024లో అని గానీ అనుకుంటున్నారా అని సోషల్ మీడియా అనుకుంటున్నట్టుగా రాసింది సాక్షి. అయితే ఈ జోకులు మహాకూటమి మీదే కాదు వైకాపా మీద కూడా ఉన్న విషయం మాత్రం మర్చిపోయినట్టుంది ఆ మీడియా సంస్థ. రెండు రోజుల క్రితం గత నాలుగేళ్ళ లో జరిగిన పరిణామాల వల్ల తెలంగాణాలో తాము పోటీ చెయ్యడం లేదని వైకాపా చెప్పింది.

అంతటితో ఆగకుండా 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చెయ్యడానికి ఇప్పటినుండే ప్రణాళికలను రచిస్తున్నట్టు ఆ ప్రెస్ నోటులో పార్టీ చెప్పుకొచ్చింది. దీనితో సోషల్ మీడియాలో ఆ ప్రెస్ నోటును తిప్పుతూ జోకులే జోకులు 2018 లో పోటీ చెయ్యకుండా 2024 నాటికి తయారు కావడమంటే ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అంటూ. వాటి మీద కూడా ఒక న్యూస్ ఐటెం రాసిపడేస్తే పోయేది కదా?