Why Does Media Not Care YS Jagan Mohan Reddyజనాలకు వచ్చిన రాబోయే జబ్బులే తన ఓట్లుగా “ప్రజా సంకల్ప యాత్ర”లో జగన్ ప్రసంగాలు సాగుతున్నాయి. పోసాని కృష్ణమురళీ దర్శకత్వం వహించిన “ఆపరేషన్ దుర్యోధన” సినిమాలో హైదరాబాద్ కు సముద్రాన్ని తీసుకువస్తాను అంటే… ఎలా అయితే ఓట్లు వేసి నాటకీయంగా ఎమ్మెల్యే అవుతాడో, సరిగ్గా దానినే వైసీపీ అధినేత జగన్ కూడా అనుసరిస్తున్నట్లుగా కనపడుతోంది.

అవసరమైతే ఆకాశాన్ని క్రిందికి తీసుకువస్తాను… అన్న స్థాయిలో కురిపిస్తున్న వరాల జల్లులలో నేడు ప్రజల రోగాలు తడిసి ముద్దయ్యాయి. అవును… కాన్సర్ వస్తే కీమోథెరపీ ఫ్రీ… కిడ్నీలు పాడైతే డయాలసీస్ ఫ్రీ… కంటికి శుక్లాలు వస్తే ఆ ఆపరేషన్ ఫ్రీ… ఇలా ఒకటేమిటి… మనిషి బాడీ పార్టులకు సంబంధించిన జబ్బులన్నీ చెప్తూ… అవన్నీ తాను ఉచితంగా చేపించి ఇస్తానని హామీల వర్షం కురిపిస్తున్నారు.

అంతేనా… అక్కడితో ఆగితే “జగన్ స్వర్ణయుగం” గురించి ప్రజలు ఎలా చెప్పుకుంటారు… ఇలా జబ్బుల బారిన పడిన ప్రజానీకానికి నెలకు 10 వేల రూపాయల చొప్పున డబ్బులు కూడా ఇస్తారంట. ఏంటి… ఇదంతా మన ఆంధ్రప్రదేశ్ లోనేనా? లేక తెలంగాణా కలిపా? అన్న ఆలోచనలు చేస్తున్నారా? కాదు కాదు ఒక్క ఏపీకి సంబంధించి మాత్రమే జగన్ చెప్తున్నారు.

ప్రస్తుతం కరువు కోరల్లో ఉన్న చంద్రబాబు నాయుడు సర్కార్ పాలన ముగియగానే, ఒక్కసారిగా “జగన్ స్వర్ణయుగం” వచ్చేస్తుంది. తెల్లారే లేచేపాటికి రాష్ట్రమంతా అభివృద్ధి చెందిపోయి ఉంటుంది. మరో రెండేళ్ళ తర్వాత జరగబోయే విషయం ఇది. అలా జరగలేదా… మరో అయిదేళ్ళు కళ్ళు, నోరు, కిడ్నీలు… ఇలా అన్నీ తమ ఆధీనంలో ఉంచుకోవడమే ప్రజల వంతు! ఆ తర్వాత మళ్ళీ మామూలే..!