TDP MLC pothula Sneetha - ys Jaganఅమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా మండలి రద్దు ప్రచారం, సభలో వ్యూహంపై నిశితంగా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా..? వద్దా..? అనే అంశంపై చర్చించబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో ఐదుగురు ఎమ్సెల్సీలు సమావేశానికి డుమ్మా కొట్టి చర్చకు తెరలేపారు. అయితే టీడీఎల్పీ సమావేశానికి హాజరుకాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు ముందుగానే అధిష్టానానికి సమాచారం అందించారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ఈ ఐదుగురు ఇవాళ సమావేశానికి గైర్హాజరవుతున్నారు.

ఎందుకు హాజరుకాలేకపోతున్నామనే దానికి వివరణ ఇచ్చుకున్నారు. అయితే టీడీపీ నేతలకు తమ అనుమానాలు తమకు ఉన్నాయి. మండలిలో టీడీపీకి 32 మంది సభ్యులు (మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కాకుండా) ఉన్నారు. ఇప్పటికే పోతుల సునీత, శివనాథరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు.

మరోవైపు.. రాజీనామా ప్రకటనతో ఎమ్మెల్సీ డొక్కా సభకు గైర్హాజరులో ఉన్నారు. టీడీపీలోని మెజారిటీ ఎమ్మెల్సీలను ఆకర్షించగల్గితే జగన్ ప్రభుత్వం మండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో అధికార పార్టీ నేతలు, మంత్రులు ప్రలోభాలకు దిగారని పత్రికలలో వార్తలు వస్తున్నాయి.