YS Jagan no confidence motionగత కొన్ని రోజులుగా హల్చల్ చేసిన కేంద్రంపై “అవిశ్వాస తీర్మానం” ఇక కార్యరూపం సిద్ధించుకునే అవకాశాలు లేవని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రతిష్టతను దిగజారుస్తూ… మారిషస్ కోర్టు నుండి జగన్ తో పాటు ప్రధానికి కూడా నోటీసులు రావడంతో, ఇక అవిశ్వాసంపై జగన్ అడుగులు ముందుకు వేసే అవకాశం లేదని, జరిగిన పర్యవసానాలతో ఇప్పటికే ప్రధాని మోడీ సీరియస్ గా ఉన్నారని రాజకీయ వర్గాలలో బలంగా ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఇలాంటి పర్యవసానాలు ఎదురవుతాయనే… మార్చి 4వ తేదీకి బదులు మార్చి 21వ తేదీన అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి వైసీపీ సిద్ధమైందని, అలా అయితే ఇటు అవిశ్వాసం ఇచ్చినట్లు ఉంటుంది, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ప్లానింగ్ లో వైసీపీ వర్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఇది నోటీసులు రావడానికి ముందు మాట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో జగన్ అండ్ కో పూర్తి అసహనంతో ఉందని తెలుస్తోంది.

ఈ ప్రభావమే ప్రభుత్వ అధికారుల మీద ప్రదర్శిస్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. అయితే వారికి అర్ధం కాని అసలు విషయం ఏమిటంటే… ఇలాంటి దూకుడైన స్వభావంతో పైకి రాలేనంత మరింత లోతుకు వెళ్ళిపోతున్నారు. కేవలం ‘అవిశ్వాసం’ పెడతాము అన్న మాట వలనే ఇంత జరిగితే, ఒకవేళ అదే ‘అవిశ్వాసం’ పెడితే జగన్ మరోసారి కృష్ణుడి జన్మస్థలానికి వెళ్తారా? అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ప్రస్తుతం ఎలాంటి రిస్క్ చేయరు గనుక, మోడీ సర్కార్ పై “అవిశ్వాసం” అన్న మాటకు ‘జగన్ అండ్ కో’ తిలోధకాలు ఇచ్చేసినట్లేనా..!