vijays sai reddy YS jagan -YSRCP Cabinetఎన్నికల తరువాత మంగళవారం తొలిసారిగా పులివెందుల చేరుకున్నవైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. పలువురు నాయకులు, అభిమానులు జగన్‌ను కలిసి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. యువకులు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనతో సెల్ఫీదిగేందుకు పోటీపడ్డారు

కొందరు స్థానికులు ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. జగన్‌ కార్యాలయంలోకి వెళ్లి వారి సమస్యలు చెప్పుకొనేందుకు తలుపు వద్ద పెద్దఎత్తున జనాలు గుమిగూడారు. ఒక మహిళ తన బిడ్డకు అనారోగ్యం చేసిందని వైద్యం చేయించాలని కోరగా జగన్‌ స్పందిస్తూ 29 లేదా 30 తేదీల్లో తనను కలవాలన్నారు. వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆ మహిళకు జగన్‌ హామీ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్ 23న వచ్చే ఫలితాలలో ముఖ్యమంత్రి అవుతానని ధీమాగా ఉన్నారు కాకపోతే జబ్బు చేసిన బిడ్డ కోసం కనీసం నాలుగు రూపాయిలు తన జేబు నుండి తీయలేరా అని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.

లక్ష కోట్లు తిని కనీసం ఆ మాత్రం వైద్యం ఖర్చులు పెట్టుకోలేవా? దీనికి కూడా జబ్బు ముదరబెట్టుకుని ప్రభుత్వ డబ్బు వచ్చే వరకు ఆగాలా అని ఆయనను విమర్శిస్తున్నారు. గతంలో కూడా జగన్ ఇటువంటి వ్యాఖ్యలతోనే ఇరుకున పడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయం మీదే తన ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా సార్లు విమర్శ చేశారు. అడిగిన వెంటనే ఆమెకు ఎంతోకొంత సాయం చేసి ఆ తరువాత రమ్మంటే జగన్ కు మంచి పేరు వచ్చేది.