How-YS-Jagan-Can-Prove-That-Praja-Vedika-Demolition-is-Not-Vendetta-Politicsవైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి సారి సీఎం అయ్యి ఉండవచ్చుగాక అయితే ప్రభుత్వ అధికారగణం అంతా ఆయన వెనుక ఉండి పరిపాలనా విషయాలలో హెల్ప్ చేస్తుంది. ఇందులో తలపండిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎందరో…. వారు గాక మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు జగన్ కు సలహాదారులుగా ఉంటారు. దీనితో రోజూ వారీ పరిపాలనలో తప్పులు జరిగే అవకాశాలు తక్కువ. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి నియమింపబడ్డారు.

దీనికి సంబందించిన జీ. ఓ. కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే నిన్న సాయంత్రం ప్రభుత్వం ఉన్నఫళంగా దానిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనితో జగన్ కు విజయసాయిరెడ్డి కు మధ్య ఏమైనా చెడిందా అంటూ రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. అయితే ప్రభుత్వం ప్రకారం ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి మరో లాభదాయక పదవి (ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌) చేపట్టడం నిబంధనలకు విరుద్ధం కావడంతోనే ఆయన నియామకాన్ని రద్దు చేసినట్టు సమాచారం.

ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ వంటి చిన్న విషయాన్నీ మరిచి అసలు ముందు ఉత్తరువులు ఎలా విడుదల చేసినట్టు? పైగా ఆ ఉత్తరువులు విడుదల చేసింది చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం. మరోవైపు విజయసాయిరెడ్డి స్థానంలో ఇంకొకరిని నియమిస్తారు జగన్. కీలకమైన ఈ పదవి కేబినెట్ ర్యాంకు తో వస్తుంది. దీనితో నేతలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో కంభంపాటి రామ్మోహన్ రావు ఈ స్థానములో ఉన్నారు. ఎన్నికలలో ఓటమి తరువాత రాజీనామా చేశారు.