YSR-Congress-Trying-To-Create-A-Rift-Between-Chandrababu-and-Rahul-Gandhiపోలింగ్ తరువాత నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొత్తిగా నల్లపూస అయిపోయారు. పోలింగ్ ముగిసిన రోజున జగన్ తమదే అధికారమని.. ప్రమాణ స్వీకార తేదీని ఆ దేవుడే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఒక్కసారి వెళ్లి గవర్నర్ ను కలిశారు, ఓ రోజు బొత్స కుటుంబ సభ్యుల వివాహానికి జగన్ విశాఖ వెళ్లారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ‘అవెంజర్స్’ సినిమా చూశారు. లండన్ వెళ్తున్నారని హడావిడి జరిగినా కోర్టు పర్మిషన్ రాక దానిని రద్దు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికీ తెలియడం లేదట. పోలింగ్ తరువాత జగన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అప్పటి నుంచి రిలాక్సింగ్ మూడ్‌లోనే ఉన్నారు. పార్టీ అగ్ర నేతలకు సైతం అందుబాటులో లేరని సమాచారం. ఆయనను కలవడానికి హైదరాబాద్ వస్తున్న పార్టీ నేతలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ప్రస్తుతం వేసవి విడిది కోసం జగన్ ఇతర ప్రాంతాలకు వెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఎక్కడకి వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అనేది మాత్రం వారికి కూడా తెలీదు. పార్టీ కార్యక్రమాలను విజయసాయిరెడ్డి, ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 16న విజయవాడలోని ఒక్క ఫంక్షన్ హాల్ లో ఆ పార్టీ కౌటింగు ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మే 21న జగన్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సమావేశం అవుతారని తెలుస్తుంది. అప్పటి నుండి జగన్ పార్టీలో యాక్టీవ్ గా ఉంటారని తెలుస్తుంది. అవసరమైతే క్యాంపులు ఏర్పాటు చెయ్యడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారట.