Will-YS-Jagan-Bring-The-Kathi-Mahesh-Trouble-to-Himselfగడిచిన రెండు, మూడు నెలలుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అంతులేని ఉత్సాహంలో ఉన్నారన్నది వాస్తవం. అందుకు ప్రధాన కారణం… అప్పటివరకు టిడిపితో సయోధ్యతో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశంపై తిరుగుబావుట ఎగురవేయడంతో, అది వైసీపీకి అనుకూలంగా మారుతుందన్న సంకేతాలు ఓ వైపు కాగా, మరోవైపు తన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుండడంతో వచ్చే ఏడాది తమదే అధికారం అంటూ నమ్మకంతో చెప్తున్నారు. అయితే ఆ ఆనందం అంతా జగన్ కు ప్రస్తుతం ఆవిరి అయిపోయిందా? అంటే అవుననే టాక్ పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

రెండు రోజుల క్రితం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్’ అమోఘమైన సక్సెస్ కావడంతో టిడిపి వర్గాలు ఫుల్ ఖుషీలో ఉన్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాలు పట్టాభిషేకం చేయడంతో, చంద్రబాబుకు నీరాజనాలు పలికే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు తాజాగా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో జగన్ గుండెల్లో గుబులు మొదలైనట్లే అన్న భావన వ్యక్తమవుతోంది. సామాజిక పరంగానే కాక, పార్టీ పరంగా కూడా జగన్ ఓటింగ్ లో ఎక్కువ శాతం కాంగ్రెస్ దే అన్న విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడంతో, ఆ మొత్తం ఓటింగ్ ను జగన్ అందిపుచ్చుకోగలిగారు. ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీతో ఫలితాలను ప్రభావితం చేసేటంత ఓటింగ్ ప్రభావితం అవుతుందో లేదో గానీ, ఎంతో కొంత డ్యామేజ్ అయితే జగన్ కు జరిగే ఆస్కారం లేకపోలేదు. అందులోనూ కాంగ్రెస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ పైనే ఆధారపడి ఉండడంతో, వ్యతిరేక ఓట్లలో కూడా చీలిక ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ అంతిమంగా జగన్ కు అధికారం దక్కకుండా చేస్తాయేమో అన్న భావన వ్యక్తమవుతోంది.