YS Jagan - YSR Congress- Local pollsస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల మీద చర్చించడానికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు అన్ని రాజకీయాల పార్టీలను ఒక సమావేశానికి పిలిచారు. అయితే ఈ సమావేశానికి అధికారపక్షం డుమ్మా కొట్టింది. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

“రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా, ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 3 కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ రమేష్‌ చెప్పాలి. ఇప్పుడు దాదాపు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవచ్చా?,” అని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.

100 సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు దేశం మొత్తం లాక్ డౌన్ చేసుకున్నాం…. ఇప్పుడు వేలలలో కేసులు వస్తున్నా అన్ లాక్ పేరిట అన్నీ మొదలుపెడుతున్నాం. రోజుకు పదివేల కేసులు వచ్చే సమయంలో ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మందు షాపులు చేసింది. అప్పటినుండి ఇప్పటివరకు మందుబాబులు లైన్ లలో నిలుచోబెడుతుంది ప్రభుత్వం.

అప్పుడు లేని ప్రజారోగ్యం మీద బాధ్యత ఇప్పుడు వచ్చింది? కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో అధికార పార్టీలు ర్యాలీలు చెయ్యడం కూడా చూశాం… ముఖ్యమంత్రి వంటి వారు మాస్కులు లేకుండా తిరగడమూ చూశాం… ఎన్నికల విషయంలోనే కరోనా అంటే అధికారపార్టీ ఎన్నికలకు భయపడుతోందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.