FIR to be Filed on YS Jaganకుటుంబాలను విడదీసి రాజకీయాలు చేస్తోందంటూ ఆనాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై జగన్ దండెత్తిన విషయం తెలిసిందే. ఇదే నినాదం పట్టుకుని కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తదనంతర కాలంలో అదే సోనియా గాంధీ ‘విభజించు – పాలించు’ సిద్ధాంతాన్ని అందుకుని, ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తుల నడుమ విబేధాలు సృష్టించి ఇతర పార్టీలలో ఉన్న నేతలను తన వైపుకు తిప్పుకున్న విషయం తెలిసిందే.

అయితే రాజకీయాల కోసం నేతలు ఏదైనా చేస్తారు గనుక కుటుంబ విలువలకు అక్కడ ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ సినిమాలు, ఫ్యామిలీనే జీవితంగా భావించే ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీలో కూడా వైసీపీ కారణంగా చిచ్చు రగిలినట్లుగా కనపడుతోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎలాగైనా గెలవాలన్న తాపత్రయంతో మహేష్ బాబు బాబాయ్ చేత ఒక ప్రకటన ఇప్పించి, ప్రిన్స్ ఫ్యామిలీలో విభేదాలకు బీజం వేసారు.

తాజాగా ప్రిన్స్ బావ గల్లా జయదేవ్ పరోక్షంగా మహేష్ బాబాయ్ అయిన ఆదిశేషగిరిరావు పేరు ప్రస్తావించకుండా చేసిన విమర్శలు ఫ్యామిలీలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇబ్బంది పాలు చేస్తోందని భావించవచ్చు. రాజకీయాలకు తాను దూరం అంటూ మహేష్ చెప్పినా… ప్రిన్స్ కున్న అశేష అభిమానాన్ని ఓటు రూపంలో క్యాష్ చేసుకోవడానికి జగన్ చేయించిన ప్రకటన, అసలు విభేదాలకు కారణమైంది.