YS Jagan - ys sharmilaవైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోపంతో ఉన్న షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తుందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దీనిని ఎవరు సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. షర్మిలకు మద్దతు ఇస్తూ కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు.

“వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమే. ఆమె పార్టీ ఆలోచన చెయ్యడం తప్పేమి కాదు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడు,” అంటూ వి.హనుమంతరావు చెప్పుకొచ్చారు.

అయితే షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టడం మేలని, తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని… లంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయని, ఏపీలో అయితే జగన్ వ్యతిరేకులు షర్మిల వెంట వస్తారని.. అందు వల్ల ఆమె ఏపీలో పార్టీ పెట్టడమే మంచిదని వీహెచ్ చెప్పారు.

ఇదంతా రొటీన్ మాటలే అయినా షర్మిల విశాఖపట్నం నుండి పోటీ చెయ్యాలని అనుకోవడం దానికి జగన్ ఒప్పుకోకపోవడం విశేషం. గతంలో ఒకసారి విశాఖపట్నం పార్లమెంట్ నుండి విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. ఆ కారణంగా షర్మిల అక్కడ పోటీ చెయ్యాలని అనుకోవడం కూడా విశేషమే. అయితే తరువాతి కాలంలో అన్న విశాఖను రాజధానిగా చేస్తారని షర్మిల పోటీ చెయ్యదలిచారా?