Jagan Government Suspecting Trouble in Nimmagadda's Issue?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాష్ట్రమంతా తిరిగి కనిపించిన ఖాళీ జాగాలన్నిటినీ సేకరించారు. కొన్ని చోట్ల పేదలను కూడా ఖాళీ చేయించి స్థలాలు సిద్ధం చేశారు.

అయితే ఈ ముహూర్తాన ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో గానీ అప్పటి నుండీ అవాంతరాలే. మొదట్లో కోర్టు కేసులు ఇబ్బంది పెట్టగా… ఆ తరువాత పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఉగాదికి ముహూర్తం పెట్టారు… స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆపేశారు.

స్వయంగా ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ అధికారి మీద కులం పేరిట విమర్శలు చెయ్యడం ఉండవల్లి వంటి వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులు కూడా తప్పు పట్టారు. దానితో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద విరుచుకుపడటంతో అభాసుపాలయ్యారు.

ఆ తరువాత ఏప్రిల్ 9న అంబెడ్కర్ జయంతి కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేద్దాం అనుకున్నారు కాకపోతే కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఇలా కాదని కొంచెం దూరంగా జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపడదామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ సరైన వాయిదా పడకుండా ఈ కార్యక్రమం జరగాలని ఆ పార్టీ వారు కోరుకుంటున్నారు.