Three capitals in andhra pradesh state-YS jaganఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. రక్తపు మడుగులో గాయాలతో పడి ఉన్న వివేకాని చూసి కూడా ముందు వైఎస్సార్ కాంగ్రెస్ వారు అది గుండెపోటు అని మీడియాతో చెప్పడంతో ఆ కేసుపై అప్పటి అధికార పార్టీ వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

పరిస్థితి చెయ్యి దాటి పోకుండా జగన్ వివేకా కుటుంబ సభ్యులను రంగంలోకి దించి ప్రభుత్వం మీదే విమర్శలు చేయించారు. సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే అధికారంలోకి వచ్చాకా జగన్ ఆ విషయం జోలికే వెళ్ళలేదు. దేనితో కేసుని సిబిఐకి అప్పజెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ రవి కోర్టు తలుపు తట్టారు.

గతంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నందున వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని అప్పట్లో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును అభ్యర్థించారని, ఇప్పుడు సిట్‌ దర్యాప్తు సక్రమంగా జరుగుతోందని అందుకే సీబీఐ అవసరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు తెలపడం విశేషం.

ఈ కేసులో ముఖ్యమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ప్రమేయం ఉన్నట్టు టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. వారికి ప్రమేయం లేకపోతే సిబిఐకి కేసుని అప్పగించడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు సిబిఐకి వెళ్తే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టొచ్చు అని టీడీపీ భావిస్తుంది.