YS Jagan writes letter to Pawan Kalyan Jana Sena Partyవైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, విపక్ష నేత జగన్ మరోసారి ప్రత్యేక హోదాను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఐతే ఈ ప్రయత్నం ప్రజలను పెద్దగా ప్రభావితం చెయ్యలేదనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా ను డిమాండ్ చేస్తున్న మేధావి వర్గాలు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ,వామపక్షాలు, కాంగ్రెస్ కు చెందిన వారు కూడా చేతులు కలపాలని ఆ పార్టీ నాయకులు వేరువేరు వేదికల పై వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసెనకు ప్రేమ లేఖలు రాస్తుందనే చెప్పాలి. ఐతే విశ్లేషకులు మాత్రం జగన్ పవన్ కల్యాణ్ మద్దత్తు కోసం తాపత్రయ పడటంకంటే ముందు తన వైఖరి మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రత్యేక హోదా అంటూ సభలు పెట్టి ఏమాత్రం సంబంధం లేని చంద్రబాబును తిడుతూ బీజేపీకు మాత్రం అన్ని విషయాలలోనూ మద్దత్తు పలికి జనాలు తమకు బ్రహ్మరధమ్ పట్టలనుకోవడం అవివేకం.

తెలుగు ప్రజలు మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు వారి రాజకీయ పరిణితికి ప్రతీతి. ఈ విషయం జగన్ చిత్తశుద్ది ఏపాటిదో వారికి ఈపాటికే ఒక ఐడియా వచ్చేసింది. జగన్ అనేకానేక కారణాల వల్ల బీజేపీ ని ధిక్కరించలేదు అనే విషయం అందరికి తెలిసిందే. కావున ఈ అంశం పక్కన పెట్టి వేరే విషయం చూస్కుంటే అందరికి మంచిది.