YS Jagan Worried about National media on three capitals in andhra pradeshఅమరావతి మార్పు, మూడు రాజధానుల ఏర్పాటుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఎండగట్టారు సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా. ఆయన ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్ కు చేసిన వీడియో లోని అంశాలు ఈరోజు చాలా తెలుగు వార్తా పత్రికలలో వచ్చాయి. దీనితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.

ఈ మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ మీడియాలో తరచుగా వార్తలు రావడంతో ఆయన ఆగ్రహం చెందుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా ఈ శేఖర్ గుప్తా సాక్షి పత్రికకు రెగ్యులర్ కాలమిస్టు. ట్విట్టర్ లో జగన్ మోహన్ రెడ్డి ఫాలో అయ్యే అతికొద్ది మంది అకౌంట్లలో శేఖర్ గుప్తా అకౌంట్ ఒకటి.

దీనితో జగన్ మరింత ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితి మారాలని తన పీఆర్ఓలకు స్ట్రిక్టుగా చెప్పినట్టు సమాచారం. అలాగే ఈ విషయంలో అవసరమైతే ప్రశాంత్ కిషోర్ టీం సాయం తీసుకుని నేషనల్ మీడియాలో డామేజ్ కంట్రోల్ చెయ్యాలని ఆయన భావిస్తున్నారట.

అమరావతిని మార్చాలని జగన్ నిర్ణయించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాని మీద ఫైనల్ నివేదిక వచ్చే సమయంలో ఈ విషయానికి మరింత కవరేజ్ రావడం ఖాయం ఆ టైంకి పరిస్థితి చక్కదిద్దక పోతే పరిస్థితిలు పూర్తిగా చెయ్యి దాటే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. ఆ నెగటివ్ కవరేజ్ కేంద్రంలోని పెద్దల మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది.